తన ఆంటీకి వీడ్కోలు చెప్పేందుకు సెక్యూరిటీని పర్మిషన్ అడిగిన చిన్నారి

తన ఆంటీకి వీడ్కోలు చెప్పేందుకు సెక్యూరిటీని పర్మిషన్ అడిగిన చిన్నారి

విమానంలో వెళ్లిపోతున్న తన ఆంటీకి వీడ్కోలు చెప్పేందుకు ఒక చిన్నారి ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ సిబ్బంది అనుమతి కోరిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు నాలుగేళ్ల ఓ చిన్నారి పాప నడుచుకుంటూ సెక్యూరిటీ అధికారి వద్దకు వెళ్లి విమానంలో వెళ్లిపోతున్న తన ఆంటీకి వీడ్కోలు చెబుతానంటూ చేతులతో సైగలు చేయగా.. సెక్యూరిటీ అధికారి ముసిముసిగా నవ్వుతూ ఓకే చెప్పడంతో ఆ చిన్నారి ఎయిర్ పోర్టులో తన ఆంటీ వద్దకు పరిగెత్తుతూ వెళ్లింది. చిన్నారి ఎంతో సంతోషంగా.. ఉత్సాహంగా వెళ్తుండడాన్ని సెక్యూరిటీ అధికారి నవ్వుతూ గమనించగా..తమ పాప రాకను గమనించిన ఆమె బంధువు చిన్నారికి ఎదురొచ్చి ఎత్తుకుని హత్తుకున్నారు.
అయితే ఈ తతంగాన్నంతా వీడియో తీసిన కెప్టెన్ హిందుస్తాన్ అనే ట్విట్టర్‌ యూజర్‌ ఈ వీడియోను తన అకౌంట్లో పోస్ట్‌ చేశారు. ‘ఎయిర్ పోర్టులో తన ఆంటీకి వీడ్కోలు చెప్పడానికి ఆమె సెక్యూరిటీ అధికారిని అడిగింది’ అనే శీర్షికతో ట్విట్టర్ లో పోస్టు చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజనులు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లతో రీట్వీట్ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులో చిన్నారి వినయం, విధేయత తమను మంత్రముగ్దులను చేసిందని, చాలా సంతోషం వేసిందని.. తమ పిల్లలు గుర్తుకొచ్చి కళ్లలో నీళ్లు వచ్చాయంటూ స్పందిస్తున్నారు. ఈ వీడియో ఎక్కడిదోగాని.. నెటిజన్లు మాత్రం ఖతార్ లోని దోహాలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అని పేర్కొంటూ సదరు ఎయిర్‌పోర్ట్‌కు అభినందనలు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. వీడియో మీరు కూడా చూసేయండి మరి..