రైలు టికెట్లపై రాయితీ మరో ఏడాది పొడిగింపు

V6 Velugu Posted on Jun 14, 2021

న్యూఢిల్లీ: రైలు టికెట్లపై రాయితీ మరో ఏడాది పొడిగించారు. ప్రయాణికులు రైలు టికెట్లు బుక్ చేసుకుని యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే రాయితీ కల్పిస్తున్న విషయ తెలిసిందే. కరోనా నేపధ్యంలో డిజిటల్ రాయితీలను ప్రోత్సహించాలన్న కేంద్ర సూచనల మేరకు భారత రైల్వే అధికారులు 2017 డిసెంబర్ నుంచి యూపీఏ పేమెంట్లకు కల్పిస్తున్న రాయితీలను మరో ఏడాది వరకు పొడిగించారు. ఆన్ లైన్ బుకింగ్ చేసుకునే వారితోపాటు రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో కూడా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వారికి టికెట్ల ధరలో 5 శాతం వరకు రాయితీ లభిస్తోంది. ఈ రాయితీ వచ్చే ఏడాది అంటే 2022 జూన్ వరకు పొడిగించారు. 

Tagged Indian Railways, , train tickets booking, discount on train tickets, upi payments for train tickets

Latest Videos

Subscribe Now

More News