విద్యా సంస్థలకు కరోనా మార్గదర్శకాలు ఇవే

విద్యా సంస్థలకు కరోనా మార్గదర్శకాలు ఇవే
  • విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు
  • అనుసరించాల్సిన నిబంధనలు విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విద్యాసంస్థల్లో అటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు సహా ఎవరూ COVID-19 బారినపడకుండా అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని రకాల యాజమాన్యాల్లోని విద్యా సంస్థలు ఈ మార్గదర్శకాలను తప్పక అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి నిర్లక్ష్యం, అజాగ్రత్తలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.  
పాటించాల్సిన మార్గదర్శకాలు
ఫిజికల్ డిస్టెన్స్ (భౌతిక దూరం)  తప్పనిసరిగా పాటించాలి.
ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి.
చేతులు తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
అలాగే శానిటైజర్ కూడా తప్పనిసరి.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని రెగ్యులర్ గమనించాలి.
పాఠశాల ఆవరణలో ఉమ్మడం పూర్తిగా నిషేధం.
విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండి చదువుకోవాలంటే ఆన్ లైన్ తరగతుల ద్వారా చెప్పాల్సిందే.
ఫిజికల్ అటెండెన్స్ తప్పనిసరి కాదు.
వెనకబడిన విద్యార్థులపై స్కూల్ ప్రిన్సిపాల్ తప్పనిసరిగా దృష్టి సారించాలి. 
అవసరమైతే బ్రిడ్జి కోర్సు లను ఇంప్లిమెంట్ చేయాలి.
పాఠశాల ఆవరణలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటయ్యేలా చూడాలి.
పిల్లలను స్కూలుకు పంపకపోతే  పేరెంట్స్ పై లేదా విద్యార్థిపై ఎలాంటి పెనాల్టీ విధించకూడదు.
పాఠశాల అసెంబ్లీ, గ్రూప్ డిస్కషన్స్, గేమ్స్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అనుమతి లేదు.
మధ్యాహ్న భోజనం (మిడ్ డే మీల్స్) సమయంలో కిచెన్  క్షుణ్నంగా పరిశీలించాలి.
మంచి శుచికరమైన నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలి.
కిచెన్ రూమ్,  డైనింగ్ హాల్లో కూడా ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి.
విద్యార్థులు ఎంట్రీ ఎగ్జిట్ సమయాల్లో ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి.
ట్రాన్స్ పోర్ట్ సమయంలో కూడా covid నిబంధనలు పాటించాలి.