చివరి పాటను సిరివెన్నెలకు అంకితం చేసిన ‘శ్యామ్ సింగ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ టీమ్

చివరి పాటను సిరివెన్నెలకు అంకితం చేసిన ‘శ్యామ్ సింగ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ టీమ్

తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రో ఎన్నో సినిమాలకు పాటలు రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. కానీ చివరగా ఆయన కలం కదిలింది ‘శ్యామ్ సింగ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కోసం. నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం రెండు పాటలు రాశారాయన. ఆరోగ్యం బాలేకపోవడంతో ఓ పాట రాసిన తర్వాత రెండో పాట రాయలేనని అన్నారట సిరివెన్నెల. కానీ ఓరోజు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఫోన్ చేసి, పల్లవి చెబుతాను రాసుకోమన్నారట. ‘నెలరాజుని ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల’ అని చెప్పడంతో ‘ఇందులో మీ సంతకం ఉందేంటి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అన్నాడట దర్శకుడు.

‘ఏమో ఎవరికి తెలుసు.. ఇదే నా చివరి పాటేమో’ అని నవ్వేశారట సిరివెన్నెల. అదే జరిగింది. ఆ పాటే ఆయన చివరి పాట అయ్యింది. ఆయన అంత్యక్రియల రోజే ఈ పాట రికార్డయ్యింది. అందుకే ఈ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిరివెన్నెలకు అంకితం చేసిన టీమ్.. నిన్న ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకొచ్చింది. మిక్కీ జె మేయర్ మెలోడియస్ ట్యూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సిరివెన్నెల రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. అనురాగ్ కులకర్ణి పాడిన విధానం ఆకట్టుకుంది.

నాని, సాయిపల్లవిల మధ్య అనుబంధాన్ని చూపేలా రూపొందించిన మాంటేజ్ సాంగ్ ఇది. పగటిపూట అపరిచితుల్లా మెలుగుతూ, రాత్రివేళల్లో రహస్యంగా కలుసుకుంటున్నారిద్దరూ. ఆ క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అందంగా ప్రెజెంట్ చేశారు. కృతీశెట్టి, మడొన్నా సెబాస్టియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 24న రిలీజ్.