కంటి చూపు కాపాడుకునేందుకు..

కంటి చూపు కాపాడుకునేందుకు..

ఒకప్పుడు 30 దాటాకో.. 40 ఏండ్లకో సైట్‌‌ వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే కళ్ల సమస్యలు వస్తున్నాయి. ఎనిమిది, తొమ్మిదేండ్లకే సైట్‌‌ సమస్య పెరిగిపోతోంది. దానికి తోడు వర్క్‌‌ ఫ్రమ్‌‌హోమ్‌‌, ఆన్‌‌లైన్‌‌ క్లాసుల పుణ్యమా అంటూ స్క్రీన్‌‌ టైమ్‌‌ కూడా పెరిగిపోయింది. కళ్లద్దాలు కంపల్సరీ అయిపోయాయి. అలా కంటికి ఇబ్బంది రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. 


విటమిన్స్‌‌, మినరల్స్‌‌, న్యూట్రిన్స్‌‌ పుష్కలంగా ఉన్న ఫుడ్‌‌ తీసుకుంటే హెల్దీగా ఉంటాం. ఏ, సి, ఇ విటమిన్లు, జింక్‌‌, ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌‌ ఉన్న ఫుడ్​ తీసుకోవడం వల్ల మాక్యులర్‌‌‌‌ డీ జనరేషన్‌‌ అవ్వకుండా ఉంటుంది. కంటి చూపు కూడా క్లియర్‌‌‌‌గా ఉంటుంది. వాటితో పాటు కూరగాయలు, చేపలు ఎక్కువగా తినాలి.  కంటిచూపు సక్రమంగా ఉండాలంటే కార్టినాయిడ్స్‌‌ చాలా ముఖ్యం. గుడ్లు, ఆకుకూరలు, కూరగాయల్లో అవి ఎక్కువగా ఉంటాయి. అందుకే, వాటిని బాగా తినాలి. కళ్లలో పిగ్మెంట్‌‌ డెన్సిటీని పెంచేందుకు కూడా అవి బాగా ఉపయోగపడతాయి. డయాబెటిస్‌‌, బీపీ, క్రానిక్‌‌ ఇన్‌‌ఫ్లమేషన్‌‌ లాంటి సమస్యలు ఉన్నవాళ్లు కచ్చితంగా రెగ్యులర్‌‌‌‌ చెకప్‌‌ చేయించుకోవాలి. లేకపోతే చూపుబాగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కంటిచూపు అనేది ఫిట్‌‌నెస్‌‌పై కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఫిట్‌‌గా ఉంటామో అంత మంచి కంటిచూపు ఉంటుంది. అందుకే, ఐడియల్‌‌ వెయిట్‌‌ మెయింటైన్‌‌ చేస్తే షుగర్‌‌‌‌, బీపీ లాంటి సమస్యలు కూడా రావు. దాంతో కంటిచూపు సక్రమంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువసేపు స్క్రీన్‌‌ చూడాల్సి వస్తుంది. అందుకే, ప్రొటక్టివ్‌‌ ఐ వేర్‌‌‌‌ కచ్చితంగా వాడాలి. దానికోసం ‘జీరో’ పవర్‌‌‌‌ కళ్లద్దాలు వాడితే బెటర్‌‌‌‌. దానివల్ల స్క్రీన్‌‌ నుంచి వచ్చే హానికర బ్లూ రేస్‌‌ డైరెక్ట్‌‌గా కళ్లమీద పడకుండా ఉంటాయి. సూర్యుడి నుంచి వచ్చే యూవీఏ, యూవీబీ కిరణాల వల్ల కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఎండ లోకి వెళ్లినప్పుడు సన్‌‌గ్లాసెస్‌‌ వాడాలి. గంటల కొద్దీ స్క్రీన్స్‌ ముందు కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 20 – 20– 20 రూల్‌ పాటించాలి. అంటే కచ్చితంగా 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును గమనించాలి. దానివల్ల కళ్లమీద ఒత్తిడి లేకుండా ఉంటుంది.