- కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం
- యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీసులో ఘటన
యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని మున్సిపల్ ఆఫీసులో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. నైట్ వాచ్ మెన్ విధుల్లో లేకపోవడాన్ని గుర్తించిన దుండగులు.. ఆఫీస్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చోరీకి యత్నించారు. చైర్మన్, కమిషనర్ చాంబర్లలోని కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఘటనపై గురువారం ఉదయం కమిషనర్ లింగస్వామి పోలీసులకు కంప్లయింట్ చేశారు.
పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. ఆఫీసులో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను గుర్తించడం కష్టంగా మారింది. దీంతో ఆఫీస్ కు వచ్చే రూట్లలోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు అనుమతి లేకుండా డ్యూటీకి డుమ్మా కొట్టిన నైట్ వాచ్ మెన్ శ్రీకాంత్ ను విధుల నుంచి తొలగించినట్లు కమిషనర్ లింగస్వామి తెలిపారు.
