జాగ్రత్తపడకపోతే థర్డ్ వేవ్ తప్పదు..

జాగ్రత్తపడకపోతే థర్డ్ వేవ్ తప్పదు..

కరోనా సెకండ్ వేవ్ కేసుల ఉధృతి తగ్గుతున్న క్రమంలో ప్రజలతోపాటు.. పాలకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మొదటి దశ ముగిశాక అన్ని కార్యకలాపాలు యధావిధిగా నిర్వహించుకునే క్రమంలో నిబంధనలు పాటించకపోవడం.. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్.. శానిటైజేషన్.. మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరిగినందుకు సెకండ్ వేవ్ లో కరోనా విరుచుకుపడిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ సునామీలా విరుచుకుపడడంతో అక్షల మంది అర్ధాంతరంగా తనువు చాలించారు. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో అనేక మంది చనిపోవడం.. హాస్పిటళ్లలో కనీసం చేర్చుకునేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితులు చవి చూశాము. కరోనా సెకండ్ వేవ్ లో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కేసులు మాత్రం అదుపులోకి రాలేదు. కనీసం 60 శాతం వ్యాక్సినేషన్ పూర్తి కాకముందే అన్ లాక్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు మొదలుపెట్టడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గట్టి షరతులతో అన్ లాక్ మొదలుపెట్టకుండా మొదటి దశలో చేసిన తప్పులే ఇప్పుడూ చేస్తుండడంపై అనేక మంది వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు
కరోనా సెకండ్ వేవ్ ముగుస్తోందన్న ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్న అమెరికా ప్రకటనను కూడా వారు తీవ్రంగా వ్యతిరేకించారు. మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్న అమెరికా కూడా ఇప్పుడు కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతుండడంతో కలవరపడుతోంది. ముఖ్యంగా రోజుకొక రకం కొత్త వేరియంట్లు బయటపడుతున్న కొద్ది కరోనా నిబంధనలను అమెరికా మళ్లీ మొదలుపెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. 
స్థిరంగా కొనసాగుతున్న యాక్టివ్ కేసులు
గత రెండు నెలలుగా వ్యాక్సనేషన్ ప్రక్రియ ఉధృతంగా చేపట్టినా యాక్టివ్ కేసుల్లో పెరుగుదల తగ్గినా.. స్థిరంగా కొనసాగుతోంది. చెన్నై.. పుణేలోని వైరాలజీ ల్యాబ్ నిపుణుల అధ్యయనం ప్రకారం సెకండ్ వేవ్ కు ముందు పరిస్థితులు.. ఆ తర్వాత పరిస్థితులను విశ్లేషించారు. కేసులు తగ్గుముఖం పట్టినా యాక్టివ్ కేసులు తగ్గలేదని.. స్థిరంగా కొనసాగుతున్నాయని తేల్చారు. ఇదే పరిస్థితి కొనసాగితే థర్డ్ వేవ్ మొదలై ఉప్పెనలా విరుచుకుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 
ఆర్ నాట్ విలువ 1 శాతం కంటే ఎక్కువే
వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకే సామర్థ్యాన్ని ఆర్ నాట్ గా పిలుస్తారు. తాజాగా ఆర్ నాట్ విలువ 0.78 నుంచి 0.88 శాతానికి పెరిగింది. ఆర్ నాట్ విలువ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉండగా.. కేరళ, మహారాష్ట్రల్లో ఆర్ నాట్ విలువ  శాతం కంటే ఎక్కువే నమోదు అవుతోంది. అంటే ఆర్ నాట్ 1 శాతం దాటితే కేసుల ఉధృతి మరింత వేగం పుంజుకుంటుదని అర్థం. ప్రస్తుతం సెకండ్ వేవ్ ముగుస్తుందని ప్రచారం జరుగుతుందంటున్నా వాస్తవంలో మాత్రం చాలా దూరంలో ఉన్నాము. మొదటివేవ్ ముగిసే సమయానికి కేసుల వ్యాప్తి 9 వేలకు తగ్గిపోయింది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా కేసులు 40 వేలకు పైగానే నమోదు అవుతుండడంతో ముగింపు చివరి దశ అనుకోవడానికి వీల్లేని పరిస్థితి. మరో వైపు కొత్త వేరియంట్లు పుట్టుకు వ్తుండడంతో నిర్లక్ష్యం వహించవద్దని  ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు హెచ్చరికలు చేశారు. దేశ వ్యాప్తంగా కేసుల నమోదు 10వేలకు దిగువన నమోదైనప్పుడే చివరి దశ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆ స్థాయికి చేరుకోవడానికి ఇంకా చాలా సమయం ఉన్నట్లు అర్తం అవుతోంది. అయితే దీన్ని పాలకులు పట్టించుకోకుండా ఆర్ధిక , వాణిజ్య ఒత్తిళ్లతో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తుండడం.. సామాజిక దూరం.. శానిటైజేషన్.. వ్యాక్సినేషన్ ను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం తదితర పరిణమాలు థర్డ్ వేవ్ కు చేరువ చేస్తున్నాయి. ఆర్ నాట్ విలువను  శాతం కంటే తక్కువ ఉండేలా చూసుకోకపోతే థర్డ్ వేవ్ సునామీలా విరుచుకుపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆ సంకేతాలు కనిపిస్తున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చే పరిస్థిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.