యువకుడిని కొట్టి చంపిన వారిని కఠినంగా శిక్షించాలి

యువకుడిని కొట్టి చంపిన వారిని కఠినంగా శిక్షించాలి

హైదరాబాద్: ఓల్డ్ సిటీలో యువకుడిని కొట్టి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మృతుడి కుటుంబ సభ్యులు. శనివారం అర్ధరాత్రి డబిర్ పుర స్ట్రీట్ ఫైట్ లో గాయాల పాలైన అద్నాన్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సీసీ ఫుటేజ్ లో రికార్డు స్ట్రీట్ ఫైట్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయ. ఈ సంఘటనపై అద్నాన్ బాబాయ్ మాట్లాడుతూ.. ఐదుగురు యువకులు కలిసి తమ కొడుకును కొట్టారని.. 14 రోజుల్లో హత్య చేసిన యువకులు బెయిల్పై విడుదల అవుతారు కానీ.. మా కొడుకుని మేము కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి ఘటనలు జరకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని..గతంలో ఇలాంటి సంఘటనతో ఓ యువకుడు మృతి చెందాడని తెలిపాడు.

గొడవ జరగక ముందు అద్నాన్ ఇంట్లోనే ఉన్నాడని.. చిన్న వివాదంతో మొదలైన గొడవ రెండు గ్రూపులుగా విడిపోయి స్ట్రీట్ ఫైట్ కు దిగినట్లు తెలుస్తుందన్నాడు. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడటంతోనే అద్నాన్ కు తీవ్ర గాయాలైనట్లు సీసీ కెమెరాలో స్పష్టంగా ఉందన్నాడు.  యువకుల మధ్య సాధారణంగా గొడవలవలు జరుగుతాయి  కానీ.. ప్రాణాలు తీసుకునే కల్చర్ ఎక్కడిదని ప్రశ్నించాడు. నజీబ్, ముజీబ్, కమ్రాన్ అబ్దుల్లా అజీజ్ లు దాడి చేసిన వారిలో ఉన్నారు.