ముంబై మెరిసేనా? ఇవాళ కోల్‌‌‌‌కతాతో సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌

ముంబై మెరిసేనా? ఇవాళ కోల్‌‌‌‌కతాతో సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌

చెన్నై: స్టార్లు అందుబాటులో ఉన్నా.. ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో విఫలమైన ముంబై ఇండియన్స్‌‌‌‌ మరో పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్‌‌‌‌–14లో భాగంగా మంగళవారం జరిగే లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో కోల్‌‌‌‌కతాతో తలపడనుంది. స్లో స్టార్టర్స్‌‌‌‌గా పేరున్న ముంబైకి కేకేఆర్‌‌‌‌పై ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరుజట్లు 27 మ్యాచ్‌‌‌‌లు ఆడితే ముంబై 21సార్లు నెగ్గింది. కోల్‌‌‌‌కతా ఆరుసార్లు మాత్రమే గెలిచింది. బలం, బలగం ప్రకారం చూసుకుంటే ఈ మ్యాచ్‌‌‌‌లో ముంబై ఫేవరెట్‌‌‌‌గా కనిపిస్తున్నా... సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌లో నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ ఆటను చూస్తే గెలుపు ఎవరి వైపు ఉంటుందో చెప్పడం కష్టం. ఈ మ్యాచ్‌‌‌‌ కోసం ముంబై లైనప్‌‌‌‌లో మార్పులు చేసే చాన్స్‌‌‌‌ ఉంది. క్వారంటైన్‌‌‌‌ నుంచి బయటపడిన డికాక్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో విఫలమైన రోహిత్‌‌‌‌ గాడిలో పడితే భారీ స్కోరు ఖాయం. మిడిలార్డర్​లో సూర్యకుమార్‌‌‌‌, ఇషాన్‌‌‌‌, పాండ్యా బ్రదర్స్‌‌‌‌, పొలార్డ్‌‌‌‌ చెలరేగితే.. కేకేఆర్‌‌‌‌కు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్‌‌‌‌లో బుమ్రా, బౌల్ట్‌‌‌‌కు తిరుగులేదు. స్పిన్నర్‌‌‌‌గా రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ మరింత పరిణతి చూపెట్టాలి. 

కథ మారుస్తుందా?

మరోవైపు కోల్‌‌‌‌కతానూ తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. నితీశ్‌‌‌‌ రాణా, రాహుల్‌‌‌‌ త్రిపాఠి మరోసారి నిలబడితే ఎంతటి లక్ష్యమైనా.. కేకేఆర్‌‌‌‌కు పెద్ద కష్టం కాదు. కాకపోతే భారీ ఆశలు పెట్టుకున్న శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ వైఫల్యం టీమ్‌‌‌‌ను వెంటాడుతున్నది. వీలైనంత త్వరగా గిల్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి వస్తే కోల్‌‌‌‌కతాకు ఓపెనింగ్‌‌‌‌ కష్టాలు తీరుతాయి. ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో గ్రాండ్‌‌‌‌ విక్టరీతో జోష్‌‌‌‌ మీదున్న నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ టీమ్‌‌‌‌లోనూ పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. నరైన్‌‌‌‌, రసెల్‌‌‌‌, షకీబ్‌‌‌‌తో పర్‌‌‌‌ఫెక్ట్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్లు అందుబాటులో ఉండటం టీమ్‌‌‌‌కు లాభించే అంశం. లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ ఫినిషర్‌‌‌‌గా ఆకట్టుకుంటున్నాడు. కోల్‌‌‌‌కతా బౌలింగ్‌‌‌‌లో కమిన్స్‌‌‌‌, ప్రసీధ్‌‌‌‌ కృష్ణ మరోసారి కీలకం కానున్నారు. రసెల్‌‌‌‌, షకీబ్‌‌‌‌, నరైన్‌‌‌‌ కూడా బాల్‌‌‌‌తో ఆకట్టుకోవాలి. ముంబైతో ఆడిన లాస్ట్‌‌‌‌ 12 మ్యాచ్‌‌‌‌ల్లో కోల్‌‌‌‌కతా ఒక్కసారే గెలిచింది.