కడప నగరంలో సినీనటి సమంత సందడి

V6 Velugu Posted on Dec 12, 2021

వైఎస్సార్ జిల్లా: కడప నగరంలో సినీనటి సమంత సందడి చేశారు. ఆదివారం కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత తరలివచ్చారు. మాంగల్య షాపింగ్ మాల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మాంగల్య షోరూం ను ప్రారంభిస్తున్న సందర్భంగా సినీ నటి సమంతను ఆహ్వానించారు.
సమంత ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కిక్కిరిసిన అభిమానుల సందడిని ముందే ఊహించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానుల కేరింతల మధ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సమంత.. మాల్ ను కలియ తిరిగి మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం మాల్ బయటకు వచ్చి తన కోసం ఎదురు చూస్తున్నఅభిమానులకు చేతులు ఊపి అభివాదం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష , మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

Tagged AP, Andhra Pradesh, kadapa, Heroin, Opening, samantha, Shopping Mall, tollywood, visit

Latest Videos

Subscribe Now

More News