పారా వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమోద్ కొత్త చరిత్ర

పారా వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమోద్ కొత్త చరిత్ర

పనామా: ఇండియా పారా బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రమోద్ భగత్ విశ్వ వేదికపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్ పారా వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఆరోసారి గోల్డ్ మెడల్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన మెన్స్ ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌3 కేటగిరీ ఫైనల్లో ప్రమోద్  21–-12, 21–-18 తేడాతో వరుస గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ముహమ్మద్ ఇమ్రాన్ (ఇండోనేసియా)ను ఓడించాడు. 

వరుసగా నాలుగో సింగిల్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఆరోసారి పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. ఈ క్రమంలో చైనా లెజెండరీ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిన్ డాన్ (5 టైటిళ్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. రెగ్యులర్, పారా బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యధిక సింగిల్స్ వరల్డ్ టైటిళ్లు గెలిచిన ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రమోద్ రికార్డు సృష్టించాడు. డబుల్స్‌‌‌‌‌‌‌‌లో సుకాంత్‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రమోద్ మరో గోల్డ్ నెగ్గాడు.