మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి : పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి : పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్
  • పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్​ గౌడ్  

ఆర్మూర్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్​ జెండా ఎగురవేసేలా పార్టీ శ్రేణులు పని చేయాలని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​చార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి హైదరాబాద్​లో టీపీసీసీ ప్రెసిడెంట్ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలపై కొద్దిసేపు చర్చించారు. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని టీపీసీసీ ప్రెసిడెంట్ సూచించారు. ఆర్మూర్​ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, నాయకులు విట్టం జీవన్,  గంగాధర్, ఖాందేశ్ శ్రీనివాస్, దేగాం శ్రీనివాస్ గౌడ్, పూల నర్సయ్య, బారడ్​ రమేశ్, జిమ్మి రవి తదితరులు పాల్గొన్నారు.