TSPSC: జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్

TSPSC: జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్

తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీని TSPSC ప్రకటించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రీలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 19న 563పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసింది.  ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పాతోళ్లకు నో ఫీజ్​
ఈ నెల 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్​పీఎస్సీ సైట్​లో ఆన్​ లైన్​ ద్వారా అప్లయ్​ చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్​కు దరఖాస్తు చేసుకున్నవాళ్లు కూడా ఇప్పుడు అప్లయ్​ చేసుకోవాలని, అయితే.. వాళ్లు మాత్రం ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. 

కొత్త వారికి మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120 ఉంటుందని వెల్లడించింది. నిరుద్యోగులకు ఎగ్జామినేషన్​ ఫీజు (రూ.120) నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలోనే రీఅప్లై , ఫ్రెష్ అనే వాటిని ఎంచుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఎడిట్ ఆప్షన్ మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి అదే నెల  27వ తేదీ సాయంత్రం 4గంటల వరకు ఉంటుంది.

పోస్టులు: డిప్యూటీ కలెక్టర్లు- 45, డీఎస్పీ- 115, సీటీవో- 48, ప్రాంతీయ రవాణా అధికారి- 4, జిల్లా పంచాయతీ అధికారి- 7, జిల్లా రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌- 6, జైళ్లశాఖలో డీఎస్పీ- 5, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ లేబర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌- 8, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌- 30, గ్రేడ్‌‌‌‌‌‌‌‌-2 మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌లు- 41, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి- 5, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి-2, జిల్లా ఉపాధి అధికారి- 5, పరిపాలనాధికారి (వైద్యారోగ్యశాఖ)- 20, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ట్రెజరీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌- 38, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ఆడిట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌- 41,  మండల పరిషత్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి అధికారి- 140.