ట్విటర్‌ సీఈఓగా జాక్‌ డోర్సీ రాజీనామా?

ట్విటర్‌ సీఈఓగా జాక్‌ డోర్సీ రాజీనామా?

ట్విటర్‌ సీఈఓ జాక్‌ డోర్సీ తన బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పలు మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి. ట్విట్టర్ సీఈఓ జాక్‌ డోర్సీ ఇపుడు ట్విటర్‌తో పాటు స్క్వేర్‌ (డిజిటల్‌ పేమెంట్‌) కంపెనీకి కూడా సీఈఓగా ఉన్న విషయం తెలిసిందే. జాక్ డోర్సి స్థానంలో మరొకరిని సీఈఓగా నియమించాలని ట్విటర్‌ వాటాదారు అయిన ఎలియట్ మేనేజ్‌మెంట్‌ 2020 నుంచి కోరుతోంది. రెండు కంపెనీలకు సీఈఓగా పనిచేయడం కష్టమని, జాక్ డోర్సీ ఏదో ఒకదానికే పరిమితం కావాలని ఎలియట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థాపకుడు పాల్ సింగర్‌ ఎప్పట్నుంచో కోరుతున్నారు. అయితే డోర్సీ రాజానామా వార్తలపై ట్వీటర్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు.