ఉక్రెయిన్ ను మరో సిరియాలా మార్చడానికి పుతిన్ ప్రయత్నిస్తున్నాడు

ఉక్రెయిన్ ను మరో సిరియాలా మార్చడానికి పుతిన్ ప్రయత్నిస్తున్నాడు
  • పుతిన్ దూకుడు అడ్డుకోవడానికి సాయం అందించండినాటో ప్రతినిధులకు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వినతి


కీవ్: రష్యాపై తమ పోరాటం కొనసాగిస్తామని.. అయితే ఉక్రెయిన్ పరిస్థితిని సిరియా లాగ మార్చడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నాడని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా ఆరోపించారు. పరిస్థితి మరింత విషమించకముందే నాటో తరపున సాయం అందించాలని ఆయన కోరారు. నాటో సభ్య దేశాల ప్రతినిధులతో సమావేశం అనంతరం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా వీడియో సందేశాన్ని  సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. రష్యా క్షిపణుల దాడులను తిప్పి కొట్టేందుకు యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టం పరికరాలు అందజేసి అండగా నిలవాలని కోరారు. 

 

 

ఇవి కూడా చదవండి