ట్రైన్, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని గుర్తు తెలియని వ్యక్తి మృతి

ట్రైన్, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని  గుర్తు తెలియని వ్యక్తి మృతి
  • ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఘటన

కాగజ్ నగర్, వెలుగు: రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన ఆసిఫాబాద్​జిల్లా కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేశ్ గౌడ్ తెలిపిన ప్రకారం.. సికింద్రాబాద్– దానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఆదివారం మధ్యాహ్నం కాగజ్ నగర్ స్టేషన్ కు చేరుకోగా.. ఓ వ్యక్తి అందులోంచి దిగుతూ జారి ప్లాట్ ఫామ్–1 మధ్యలో పడ్డాడు. పోలీస్ సిబ్బంది, తోటి ప్రయాణికులు ప్లాట్ ఫామ్ పగులగొట్టి బయటకు తీశారు. 

తీవ్రంగా గాయపడిన అతడిని ట్రీట్మెంట్ కోసం కాగజ్ నగర్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. మృతుడికి 40– 45 ఏండ్ల మధ్య వయసు ఉండగా.. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. గ్రీన్ కలర్ రౌండ్ నెక్ టీ షర్టు, బ్లాక్ కలర్ నైట్ ప్యాంటు ధరించి ఉన్నారు. ఎవరైనా సంబంధీకులు ఉంటే రైల్వే  సంప్రదించాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల రైల్వే ఎస్ఐ మహేందర్ తెలిపారు.