
- బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్‌ను జాతికి అంకితం చేయనున్న మంత్రి
- ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ రఘునందన్‌రావు
రామచంద్రాపురం, వెలుగు: రామచంద్రాపురంలో ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు, నాయకులు గడ్కరీ పర్యటనను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా లింగంపల్లి బీహెచ్ఈఎల్ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి జాతికి అంకితం చేస్తారు. గడ్కరీ పర్యటన నేపథ్యంలో ఎంపీ రఘునందన్‌రావు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు పార్లమెంట్ ప్రాంతాలను కలిపే బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలవనుందని పేర్కొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాకు ముఖ ద్వారమైన లింగపల్లిలో సిగ్నల్ లెస్ఫ్లైఓవర్ నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్ల నిధులను కేంద్రం కేటాయించిందని తెలిపారు. శరవేగంగా బ్రిడ్జి పనులు పూర్తి చేసిన నేషనల్ హైవే అథారిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముంబై జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించి, ప్రత్యేకంగా సర్వీస్ రోడ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమానికి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ హెచ్ఐ రీజినల్ఆఫీసర్కృష్ణప్రసాద్, నాయకులు రవికుమార్‌యాదవ్, ఎడ్ల రమేశ్, రాంబాబు, నర్సింగ్ గౌడ్, ఈర్ల రాజు పాల్గొన్నారు.