
తెలంగాణ బాపూజీగా గుర్తింపు తెచ్చుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీపై బడుగు విజయ్ కుమార్ రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ‘యూనిటీ’. చిరందాసు ధనుంజయ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని రచయిత అశోక్ తేజ ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా బాపూజీతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అశోక్ తేజ. బాపూజీ జీవన ప్రవాహాన్ని ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తెలంగాణ ధ్వజస్తంభాలను భావితరాలు గుర్తుంచుకునేలా యూనిటీ చిత్రం ఉంటుందని ఆయన అన్నారు. ప్రేక్షకులంతా ఉచితంగా యూట్యూబ్‌లో ఈ డాక్యుమెంటరీ చూడొచ్చని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రంలో మాస్టర్ భాను, మైమ్ మధు కీలక పాత్రల్లో నటించారు.