Unstoppable Season-3: బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్-3 అప్డేట్..ఎప్పుడో తెలుసా?

Unstoppable Season-3: బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్-3 అప్డేట్..ఎప్పుడో తెలుసా?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హోస్ట్ గా ఆహా(AAHA) ఓటీటీలో అన్ స్టాపబుల్(Unstoppable) రియాలిటీ షోతో దుమ్ములేపుతున్నారు. సక్సెసఫుల్ గా రెండు సీజన్స్ పూర్తి చేసుకొన్న అన్ స్టాపబుల్ షో.. సీజన్-3(Season 3) కోసం ఫ్యాన్స్ హుషారుగా వెయిట్ చేస్తున్నారు. బాలకృష్ణ ఈ షోతో ఆడియన్స్ లలో ఎంతో ఎనర్జీని క్రియేట్ చేశారు. లేటెస్ట్ గా ఈ ఎంటెర్టైనేమేంట్ మాస్ హంగామా త్వరలో స్టార్ట్ అవుతుందనే న్యూస్..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీజన్-3 కోసం ఆహా గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే హైయెస్ట్ టాక్ షో గా రికార్డ్స్ బ్రేక్  చేసింది ఈ షో. అంతే కాకుండా ఎక్కడ బోర్ కొట్టకుండా బాలయ్య డైలాగ్స్, అద్దిరిపోయే కామెంట్స్, ఉరకలు వేసే ఉత్సాహం ఇవన్నీ ఈ షోని మరో రేంజ్ లో ఉంచింది.     

ఇక సీజన్-3 మరింత అట్టహాసంగా స్టార్ట్ చేయడంతో పాటు..ఊహకందని రీతిలో డిజైన్ చేయబోతున్నారని తెలుస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ సీజన్-3 థీమ్ ఎలా ఉండబోతుంది..అంటూ క్యూరియాసిటీతో నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే సీజన్-3కి అప్డేట్ ఇవ్వడంలో మేకర్స్ చాలా గ్యాప్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. 

కాగా లేటెస్ట్ షోలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్  తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్, విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్స్ గెస్ట్ గా వస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే నిజమైతే బాలకృష్ణ నుంచి మరో బ్లాక్ బాస్టర్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు..ఫుల్ మీల్స్ పడటం పక్క ఖాయమే అనిపిస్తుంది. అన్ స్టాపబుల్ సీజన్-2 లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కు, రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ కు బ్లాస్టింగ్ రేంటింగ్స్ తో..షో దుమ్ములేసింది. ఈ టాక్ షో ఇంత పెద్ద రేంజ్‌లో స‌క్సెస్ కావ‌టానికి కార‌ణం.. రైటింగ్ డిపార్ట్‌మెంట్ కూడా అని చెప్పాలి. ఈ షో స‌క్సెస్‌లో రైటర్,డైరెక్టర్ 
బి.వి.ఎస్ ర‌వి(Bvs Ravi) కీల‌క పాత్ర‌ను పోషించారు.

లేటెస్ట్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)కు నాగార్జున హోస్ట్ గా సరికొత్త లుక్ లో కనిపిస్తోన్నారు.నిన్న(ఆగస్టు10న) బిగ్ బాస్ సీజన్ 7కు సంబంధించిన కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో చివరి నిమిషంలో కథను మార్చేసే కింగులా నాగార్జున(Nagarjuna) కనిపించారు. కథ మాములుగా సాగిపోతే ఏం మజా ఉంటుంది.. ట్విస్టులు ఉండాలి కదా అనే కాన్సెప్ట్ తో ఈ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే బాలీవుడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి స్టార్ట్ కాబోతున్నట్లు ప్రకటించడంతో.. ఇక అన్ స్టాపబుల్ షో ఎప్పుడు అనేది హాట్ టాపిక్ గా మారింది. 

ఈ టాక్ షోకు తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన టాప్ సెల‌బ్రిటీలు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్‌, మ‌హేష్, జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ‌, రాధిక‌ వంటి వారితో పాటు నారా చంద్ర‌బాబు నాయుడు, మోహ‌న్ బాబు, కిర‌ణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి వంటి రాజ‌కీయ నాయ‌కులు కూడా పార్టిసిపేట్ చేశారు. అన్ స్టాపబుల్ షో సీజన్-3 కి కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. బాలయ్య బాబు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి, బాబీ తో మరో మూవీ చేయునున్నారు. ఈ షూటింగ్స్ అయిపోయాకే సీజన్-3 లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.