పెళ్లై పదినెలలే.. అప్పటివరకు బాగానే ఉంది కొత్త జంట కాపురం..పండక్కి కొత్తచీర కొనివ్వమని భర్తను అడిగింది భార్య.. భర్త చీర కొనివ్వడం వాయిదా వేయడంతో అక్కడ మొదలైంది వారి మధ్య గొడవ. ఇంకేముంది భర్తపై కోపంతో క్షణికావేశంలో భార్య చేసిన పని ఆ కుటుంబంలో విషాదం నింపింది.. వివరాల్లోకి వెళితే..
యూపీకి చెందిన బాబ్లీ అనే మహిళ భర్త చీర కొనివ్వలేదని కోపంతో ఉరివేసుకుంది. పెళ్లై పదినెలలే మాత్రమే అయింది. అప్పటివరకు బాగానే ఉన్న కొత్త జంట పండగ వేళ చీర కొనుగోలు విషయంలో వచ్చిన తగాదా ముదిరి ఏకంగా ఆమె ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది.కర్వా చౌత్ అనే స్థానిక పండుగకు చీర కొనివ్వలేదని భర్తతో జరిగిన గొడవతో 25 ఏళ్ల బాబ్లీ ఆత్మహత్య చేసుకుంది.
భర్త తన డిమాండ్‌ను నిరాకరించడంతో గొడవ మరింత పెరిగి ఇంట్లోనే ఉరి వేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. @TrueStoryUP అనే వెబ్‌సైట్ Xలోఈ భార్యాభర్తల మధ్య గొడవ, క్షణికావేశంలో మహిళ ఆత్మహత్యకు సంబంధించిన పోస్ట్ చేశారు. బబ్లీ ఆత్మహత్య కొత్త జంటల్లో పెరుగుతున్న ఒత్తిళ్లపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

ఇలాంటి ఘటనలు కొత్త జంటల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని, సామాజిక అంచనాలను సూచిస్తున్నాయి. పండుగలు సంతోషాన్ని తెప్పించాలి, కానీ అవి ఒత్తిడికి మారకూడదు. మైండ్‌ఫుల్‌నెస్, కౌన్సెలింగ్ ద్వారా జంటలు మధ్య సంభాషణ పెంచుకోవాలి.
సోషల్ మీడియాలో చర్చ..
సోషల్ మీడియాలో ఈ ఘటనపై #KarwaChauthTragedy, #DomesticPressure హ్యాష్‌ట్యాగ్‌లతో చర్చలు జరుగుతున్నాయి. నెటిజన్లు పండుగలు ప్రేమను పెంచాలి..ఒత్తిడిని కాదు అని, కొత్త జంటలకు మానసిక సహాయం అవసరం అని పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ ఘటనలు మహిళల మానసిక ఆరోగ్యం, డొమెస్టిక్ రిలేషన్‌షిప్‌లపై అవగాహన పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.