
ఉప్పల్, వెలుగు: అపార్ట్మెంట్పనులు పూర్తి చేయడం లేదని, మూడేళ్లయినా ఫ్లాట్స్అప్పగించడం లేదని పలువురు బాధితులు నిరసన తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ సుమేరు పేరుతో 2022లో అపార్ట్మెంట్ నిర్మించి ఇస్తామని చెప్పి, 107 మంది వద్ద బిల్డర్లు శ్రీనివాస్కండె, నాగరాజు కండె రూ.1.25 కోట్ల చొప్పున తీసుకున్నారు.
ఇప్పటివరకు వారికి ఫ్లాట్స్ఇవ్వలేదు. దీంతో బాధితులు ఆదివారం ఉప్పల్ భగాయత్ లోని అపార్ట్మెంట్ ఎదుట ఆందోళనకు దిగారు. బయట రెంట్లు కట్టేందుకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డర్లు తమకు ఫ్లాట్లు అప్పగించాలని కోరారు. లేకపోతే న్యాయపరంగా పోరాడుతామని హెచ్చరించారు.