అమెరికాలో అక్టోబర్ నెల హిందూ సాంస్కృతిక మాసం

 అమెరికాలో అక్టోబర్ నెల హిందూ సాంస్కృతిక మాసం
  • ఫ్లోరిడా, టెక్సాస్, న్యూజెర్సీ, మసాచు సెట్స్, ఓహాయో రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాల ప్రకటన

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అక్టోబర్ నెలను హిందూ సాంస్కృతిక వారసత్వ మాసంగా పాటించనున్నారు. ఈ మేరకు  ఫ్లోరిడా, టెక్సాస్, న్యూజెర్సీ, మసాచు సెట్స్, ఓహాయో రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాల ప్రకటించాయి. అమెరికాలో వివిధ మతాల విభిన్న సంస్కృతులు శాంతికి చిహ్నాలుగా నిలుస్తున్న నేపధ్యంలో  హిందూ సంఘాల కృషితో పలు రాష్ట్రాలు స్పందించాయి. అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగడంలో భారతీయులు, భారత సంతతికి చెందిన వారు, హిందూ మత సంస్కృతి కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆయా రాష్ట్రాల గవర్నర్లతోపాటు కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు ప్రకటనలు విడుదల చేస్తున్నారు.అక్టోబర్ నెలను హిందూ సాంస్కృతిక మాసంగా గుర్తించేలా అమెరికాలోని జో బైడెన్ ఫెడరల్ ప్రభుత్వాన్ని ప్రోత్సహించే కార్యక్రమాన్ని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున చేపట్టాయని విశ్వహిందూ పరిషత్ అమెరికా విభాగం అధ్యక్షుడు అజయ్ సింగ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హిందూ సంస్కృతి, గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఇదే సరైన సమయంని ఆయన పేర్కొన్నారు.