ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు..నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి  కూలింది 

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు..నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి  కూలింది 

ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీ,హిమాచల్ ప్రదేశ్, యూపీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలోగత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్ లోని గిరిదిహ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. శనివారం కురిసిన వర్షాలకు ఈ బ్రిడ్రి వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. గిరిదహ్ జిల్లాల్లో  డియోరీ బ్లాక్ లో ఆర్గా నదిపై ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ. 5.50 కోట్లతో చేపట్టారు. అయితే శనివారం కురిసిన వర్షాలకు నది నీటి మట్టం పెరిగి  ప్రవాహంలో బ్రిడ్జి రెయిలింగ్ విరిగి పడిపోయింది. 

ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్ లో కేదార్ నాథ్ ఆలయంలో సమీపంలో హిమపాతం సంభవించింది. ఆలయం వెనక భాగంలో ఉన్న కొండలపై నుంచి ఆదివారం తెల్లవారు జామున మంచి చరియలు విరిగి పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. శనివారం తెల్లవారు జామున ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో గంగా నది నీటి మట్టం పెరగడంతో ప్రవాహంలో ఎనిమిది వాహనాలు కొట్టుకుపోయాయి. 

మరోవైపు రానున్న మూడు రోజుల్లో యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ రాష్ట్రాల్లో జూలై 2 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మేఘాలయ, అరుణాచల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం , త్రిపురలలో జూన్ 30 , జూలై 3 మధ్య 64.5 నుండి 204.4 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

ఆదివారం (జూన్ 30) రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూలై 8 నాటికి రుతుపవనాలు దేశం మొత్తాన్ని ఆక్రమిస్తాయి.