అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

కారేపల్లి, వెలుగు: అర్హులందరికీ ప్రభుత్వం దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. మండలంలోని  గేట్ రేలకాయలపల్లి, జైత్రం తండా, తవిసిబోడు గ్రామాల్లో సోమవారం  ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిందని, ప్రజా ప్రభుత్వంలో పేదలు సంతోషంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. 

అనంతరం కారేపల్లి లో వివిధ శాఖల అధికారులు సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్​చార్జి తహసీల్దార్​కృష్ణయ్య, ఎంపీడీవో సురేందర్, ఎంపీవో రవీంద్ర ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.