వందే భారత్ రైల్లో ఫుడ్ ఇలా ఉంటుందా... చెప్పిందేంటీ.. చేస్తుందేంటీ..

వందే భారత్ రైల్లో ఫుడ్ ఇలా ఉంటుందా... చెప్పిందేంటీ.. చేస్తుందేంటీ..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఇటీవల ప్రయాణించిన ఓ ప్రయాణికుడు లగ్జరీ రైలులోని ఫుడ్ క్వాలిటీ (ఆహార నాణ్యత)పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకోగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రైలులో అందించిన భోజనాన్ని, ఈ తరహా ఆహారాన్ని అందిస్తామని చెప్పిన ఫొటోలను.. రెండింటినీ పోల్చాడు. ఆ ఫొటోలు కాస్తా వైరల్ కావడంతో విషయం  ఐఆర్టీసీటీసీ (IRCTC) వరకు చేరింది.

@Railfann9971 అనే ట్విట్టర్‌ యూజర్.. వందేభారత్ రైలులో మడ్గావ్ జంక్షన్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కు ప్రయాణిస్తుండగా.. రైల్వే శాఖ వడ్డించిన “నాణ్యత లేని భోజనం”ఫొటోను పోస్ట్ చేశారు. దాంతో పాటు వారు ప్రకటనలో చూపించిన భోజనం పాత చిత్రాన్ని కూడా పంచుకున్నారు, "వందే భారత్ ప్రారంభోత్సవంలో మీ అందరికీ అహుజా క్యాటరర్స్ నుంచి రుచికరమైన ఆహారం ఉచితంగా అందించబడుతుంది" అని ఈ సందర్భంగా పేర్కొన్న ప్రయాణికుడు..  ఇటీవలి ప్రయాణంలో తనకు నాణ్యత లేని ఆహారం గురించి ప్రస్తావించాడు. ఈ ఆహారం కోసం తాను రూ.250 చెల్లించినట్టుగా కూడా తెలిపాడు. అంతేకాకుండా ఈ రైలులో సాధారణ ప్రయాణికుడుగా కొన్ని సమస్యలను కూడా ఎత్తి చూపాడు, "ఇందులో పెరుగు, శానిటైజర్, ముఖ్యంగా నాణ్యత" లోపించాయని ఆరోపించాడు.

https://twitter.com/Railfann9971/status/1675162262477357059

ఈ ట్వీట్‌కు అనేక కామెంట్లు వచ్చాయి. “IRCTC భారతదేశ ఆధునిక హైటెక్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ ఇమేజ్‌ను ఈ విధంగా దెబ్బతీస్తోంది. గోవా ఏడాది పొడవునా పర్యాటకులను చూస్తుంది. అందువల్ల, దయచేసి ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోసం క్యాటరింగ్ కాంట్రాక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయండి" అంటూ ఓ యూజర్ డిమాండ్ చేశారు. "బట్వాడా చేసే ముందు నాణ్యతను తనిఖీ చేయాలి" అని మరొకరు సూచించారు.

ప్రయాణికుడి ఆరోపణలపై IRCTC స్పందించింది. ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న రైల్వే శాఖ... “ఆహార తయారీ, డెలివరీతో సహా మా సేవలన్నింటిలోనూ నాణ్యత విషయంలో అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడానికి మేము కట్టుబడి ఉన్నాము. కంప్లైంట్ ను డైరెక్ట్ గా మెసేజ్ సెక్షన్ లో  షేర్ చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామని ఐఆర్సీటీసీ కోరింది.

https://twitter.com/IRCTCofficial/status/1676250535631155200