మరోసారి రోడ్డెక్కిన ‘వాసవి అర్బన్’ బాధితులు..రూ.1,500 కోట్లు వసూలు చేసి మోసం చేశారని ఆందోళన

మరోసారి రోడ్డెక్కిన ‘వాసవి అర్బన్’ బాధితులు..రూ.1,500 కోట్లు వసూలు చేసి మోసం చేశారని ఆందోళన

 కుత్బుల్లాపూర్, వెలుగు: బాచుపల్లిలోని వాసవి అర్బన్ ఫ్లాట్ల బాధితులు శనివారం మరోసారి రోడ్డెక్కారు. పూర్తి డబ్బులు చెల్లించినప్పటికీ ఫ్లాట్లు ఇవ్వకుండా ఏండ్ల తరబడి వేధిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. సుమారు 3 వేల మంది నుంచి రూ.1,500 కోట్లు వసూలు చేసి, ఫ్లాట్లను 2024లోనే అప్పగిస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన ప్రతీసారి 6 నెలల్లో ఇస్తామని నమ్మిస్తూ ఇప్పటివరకు 8 సార్లు మాట తప్పారన్నారు. 

ఒకవైపు ఈఎంఐలు, మరోవైపు అద్దెలు కడుతూ నరకయాతన అనుభవిస్తున్నామని వాపోయారు. నిరసన సమయంలో నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వాసవి అర్బన్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, భారీ జరిమానా విధించాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.