
వేములవాడ, వెలుగు : అన్నాచెల్లెళ్ల అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను వేములవాడలోని సోషల్వెల్ఫేర్మహిళా డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ గురువారం నిబంధనల మధ్య జరుపుకున్నారు. ఇంటికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వారి సోదరులే కాలేజీ వద్దకు వచ్చారు. లోపలికి వెళ్లేందుకు ఒప్పుకోకపోవడంతో సోదరులకు స్టూడెంట్లు గేటు వద్దనే రాఖీ కట్టి ఈస్వీట్ తినిపించారు. పండుగ రోజు కూడా రూల్స్ పెట్టారని పలువురు స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు.