డాక్టర్లు లేరు, మందులు లేవు.. జీవులు ఎలా బతుకుతాయి..

డాక్టర్లు లేరు, మందులు లేవు.. జీవులు ఎలా బతుకుతాయి..

కరీంనగర్ జిల్లా గన్నేరువరం పశు వైద్యశాల ముందు యాదవ సంఘం నేతలు ధర్నాకు దిగారు. పశు వైద్యులు లేరని, మందులు అందుబాటులో లేక సీజనల్ వ్యాధులకు అధిక సంఖ్యలో జీవాలు చనిపోతున్నాయని ఆరోపించారు. 

వెంటనే వైద్యుడిని నియమించి సరైన మందులు అందుబాటులోకి తేవాలని.. కోరుతూ మండల కేంద్రంలోని పశు వైద్యశాల ముందు యాదవులు, గొర్రెల కాపర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు.

Also Read :- వరంగల్ సీపీకి రఘునందన్ సవాల్

మండల కేంద్రంలో పశు వైద్యశాల ఉన్నదన్న పేరే కానీ.. జీవాలకు జూన్ మాసంలో పంపిణీ చేయాల్సిన మందులు సెప్టెంబర్ నెల వచ్చిన్నప్పటికీ పంపిణీ చేయలేదని మండిపడ్డారు. వైద్యశాలలో డాక్టుర్లు అందుబాటులో లేకపోవడంతో రోగాల బారిన పడిన గొర్రెలు మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పర్మినెంట్ వైద్యుడిని, గొర్రెల సీజనల్ వ్యాధులను నివారించే మందులను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.