వీడియో: బిహార్ సీఎం నితీష్పై యువకుడి దాడి

వీడియో: బిహార్ సీఎం నితీష్పై యువకుడి దాడి

పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ఓ యువకుడు దాడి చేశాడు. సీఎం నితీశ్ కుమార్ తన సొంతూరైన భక్తియార్ పూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుడు శిల్ భద్ర విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్లారు. విగ్రహావిష్కరణ చేసి పూలమాల వేసి  నివాళులర్పిస్తున్న టైంలో.. సెక్యూరిటీ సిబ్బంది పక్క నుంచే నడుచుకుంటూ వచ్చిన ఓ యువకుడు నితీశ్ కుమార్ ను వెనక వైపు నుంచి మెడపై కొట్టాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యువకుడిని పట్టుకున్నారు. స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నారు. యువకుడు దాడికి యత్నించిన ఘటన అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. సదరు యువకుడి మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.సదరు వీడియోను కింద ట్విట్టర్ లో చూడండి.

 

 

 

 

 

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే పెద్ద అవినీతిపరుడి చేతిలో తెలంగాణ నలిగిపోతోంది

కడప నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు

సింగరేణిలో మరోసారి మోగనున్న సమ్మె సైరన్ ?