గోవా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల గర్బా డ్యాన్స్.. స్టెప్పులేసిన మహిళా సిబ్బంది.. వీడియో వైరల్..

 గోవా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల గర్బా డ్యాన్స్.. స్టెప్పులేసిన మహిళా సిబ్బంది.. వీడియో వైరల్..

సూరత్‌కు వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో గోవా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు గర్బా డ్యాన్స్ చేసి సందడి చేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. 

వివరాలు చూస్తే మయూర్ అనే ఓ వ్యక్తి పని మీద గోవాకు వెళ్లాడు. అయితే అతని పని త్వరగా అయిపోవడం దుర్గా మాత నవరాత్రుల   9వ రోజు సందర్భగా సూరత్‌కు తిరిగి వెళ్లాలని అనుకున్నాడు. మొదట ట్రైన్  టికెట్ బుక్ చేసుకోగా..  ట్రైన్ ఆలస్యంగా వెళ్లనుండంతో  టికెట్ క్యాన్సల్  చేసుకుని ఫ్లయిట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. దురదృష్టవశాత్తూ విమానం కూడా ఐదు గంటలు ఆలస్యంగా వెళ్లనుంది. 

దింతో మయూర్ అలాగే అతని తోటి ప్రయాణికులు కొంచెం కూడా నిరుత్సాహపడకుండ... గోవా ఎయిర్‌పోర్ట్‌నే పండుగ మైదానంలా మార్చేసి, సరదాగా గర్బా డ్యాన్స్ చేశారు.

ఆదివారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరాల్సిన విమానం సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. ప్రయాణికులు సూరత్ వెళ్లి నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా గర్బాలో పాల్గొనాలని ఉత్సాహంతో ఉన్నారు.

 ప్రయాణికుల్లో ఒకరైన మయూర్ సూరత్ వెళ్లాలనే తన ఆసక్తిని విమాన సిబ్బందికి చెప్పాడు. దాంతో  ఎయిర్‌పోర్ట్‌లో ఈ వేడుక మొదలైంది.

విమాన సహాయకురాలు వీరి కోసం లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసి, అందరినీ గర్బా కోసం ఒకచోట చేర్చింది. విమాన సిబ్బందితో సహా ప్రయాణికులంతా గర్బా పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ప్రయాణికులు చప్పట్లు కొడుతూ గర్బా డ్యాన్స్ చేస్తుండటం చూడొచ్చు. మధ్యలో విమాన సిబ్బంది కూడా ఈ వేడుకలో పాల్గొని స్టెప్పులు వేయడం అందరికి ఆకట్టుకుంది.