పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు

పనులు  చేయకుండానే డబ్బులు డ్రా చేశారు
  • పనులే చేయకుండా డబ్బులు డ్రా చేశారు
  • సర్పంచ్, సెక్రెటరీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గ్రామ సర్పంచ్, కార్యదర్శి ఇద్దరూ కలసి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాళపాడు గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు గ్రామస్తులు ధర్నా చేశారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకున్నా పంచాయతీ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేశారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన గ్రామ సర్పంచ్, సెక్రటరీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామస్థులు.