కోహ్లీ ఇలాంటి ఆహారం తింటాడా..? అందుకే కావచ్చు ఫిట్గా ఉంటాడు

కోహ్లీ ఇలాంటి ఆహారం తింటాడా..? అందుకే కావచ్చు ఫిట్గా ఉంటాడు

వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ దంచికొడుతున్నాడు. ప్రతీ జట్టుపై పరుగుల వరదపారిస్తున్నాడు. ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్ లలో 354 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికా బ్యాటర్ డికాక్ తర్వాత ఈ టోర్నీలో కోహ్లీనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లీ కొనసాగుతున్నాడు. 

ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ సూపర్ ఫాంలో ఉండటంతో పాటు..సూపర్ ఫిట్ నెస్ తో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరిగెడుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ అంత ఫిట్ గా ఉండటానికి ఆయన తినే ఆహారమే కారణం. ఇంతకీ కోహ్లీ ఏం తింటున్నాడు. ఈ వరల్డ్ కప్ కోసం కోహ్లీ ఏమైనా స్పెషల్ డైట్ పాటిస్తున్నాడా..తెలుసుకుందాం. 

వరల్డ్ కప్  కోసం  భారత జట్టు దిగిన ఓ హోటల్లోని ఎగ్జిక్యూటివ్ చెఫ్ అన్షుమన్ బాలి..కోహ్లీ ఫిట్ నెస్ సీక్రెట్ను బయటపెడ్డాడు. ప్రస్తుతం కోహ్లీ తీసుకుంటున్న ఆహారం ఏంటో తెలియజేశాడు. కోహ్లీ  కార్బో్హైడ్రేట్స్ తక్కువగా తింటున్నాడని తెలిపాడు. 

విరాట్ కోహ్లీ వీగన్ అని చెఫ్ అన్షుమన్ బాలి తెలియజేశాడు. అతను చికెట్, మటన్ వంటి మాంసహారం తినడని పేర్కొన్నాడు. ఎక్కువగా సోయా, డిమ్ సమ్స్, మాక్ మీట్, టోపూ, లీన్ వంటి ప్రొటీన్ ఫుడ్ తింటున్నాడని చెప్పుకొచ్చాడు.