రహానే విషయంలో తప్పు చేశావ్..ధోనిపై సెహ్వాగ్ సీరియస్

రహానే విషయంలో తప్పు చేశావ్..ధోనిపై సెహ్వాగ్ సీరియస్

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నల వర్షం కురిపించాడు. తనతో పాటు..అజింక్య రహానే విషయంలో ప్రశ్నలు ఎక్కుపెట్టాడు. భారత జట్టుకు ఆడే సమయంలో రహానేను ఎందుకు తుది జట్టులోకి తీసుకోలేదని నిలదీశాడు. 

రహానేతో మాట్లాడిన ధోని..సెహ్వాగ్ ఆగ్రహం

ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానేకు  ధోనీ అవకాశం కల్పించాడు. ఈ మ్యాచులో రహానే 19 బంతుల్లో అర్థ సెంచరీ సాధించి చెన్నై విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ సమయంలో ధోనీ రహానే ఇన్నింగ్స్ పై మాట్లాడాడు.  మ్యాచ్‌కు ముందు రహానేతో మాట్లాడానని..ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేయాలని సూచించినట్లు చెప్పుకొచ్చాడు. ధోని వ్యాఖ్యలపై సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇప్పుడు ఇలా ఎందుకు..అప్పుడు అలా ఎందుకు..

ఐపీఎల్‌ 2023లో భాగంగా చెన్నై జట్టులో రహానేను ఆడించిన ధోనీ.... టీమిండియాకు ఆడే సమయంలో ఎందుకు తప్పించాడని సెహ్వాగ్ ప్రశ్నించాడు. ఏ క్రికెటర్ కు అయినా టీమ్ మేనేజ్‌మెంట్ మద్దతు ఎంతో అవసరమన్నాడు. అయితే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్న ధోని...టీమిండియాలో ఉన్నప్పుడు  రహానేకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని నిలదీశాడు. 

బాగా ఆడేవాడు కదా...

టీమిండియాకు ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వన్డేల్లో నుంచి రహానేను పక్కన పెట్టాడని... అతను స్లోగా ఆడుతున్నాడని.. స్ట్రైక్ రొటేట్ చేయడం లేదని రహానేను జట్టు నుంచి తప్పించినట్లు సెహ్వాగ్ తెలిపాడు. అయితే ఐపీఎల్‌లో చెన్నై తరపున ఆడేందుకు అడ్డురాని స్ట్రైక్ రేట్....టీమిండియాలో ఆడేందుకు అడ్డు వచ్చిందా అని ధోనిని సెహ్వాగ్ ప్రశ్నించాడు. ఇప్పుడు రహానేను మోటివేట్ చేసినట్టే.. అప్పుడు టీమిండియాకు ఆడే సమయంలో మోటివేట్ చేసి ఉంటే....రహానే అనేక మంచి ఇన్నింగ్స్‌లు  ఆడేవాడు కదా అన్నాడు.