బోధన్, వెలుగు: హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేదిలేదని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్నాయకులు హెచ్చరించారు. రాష్ట్రంలో హిందువుల దేవాలయాలు, దేవతల ఊరేగింపులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శనివారం ర్యాలీగా వెళ్లి బోధన్ సబ్ కలెక్టర్వికాస్ మహతోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. హిందువుల దేవాలయాలు, ఊరేగింపులపై దాడులు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, పోలీసు వ్యవస్థ కూడా విఫలమైందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంస్వం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల లాఠీచార్జీ అమానుషం
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందువులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుషమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అడ్లూరి శ్రీనివాస్అన్నారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంస్వం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందువుల ఆలయాలు, ఊరేగింపులపై వరుసగా దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఆర్మూర్, వెలుగు: హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్ కు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పాలనలో కొన్ని రోజులుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, బాధ్యులను గుర్తించి వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.