ద్రవిడ్ ప్రస్తానం ఇక ముగిసినట్టే.. టీమిండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్

ద్రవిడ్ ప్రస్తానం ఇక ముగిసినట్టే.. టీమిండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్

వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరనే ప్రశ్నకు క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం భారత ప్రధాన హెడ్ కోచ్ గా ఉంటున్న ద్రవిడ్ వరల్డ్ కప్ తో తన రెండేళ్ల కాంట్రాక్టు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ దిగ్గజ క్రికెటర్ ను మరోసారి హెడ్ కోచ్ గా నియమిస్తుందా.. లేకపోతే  హెడ్ కోచ్ బాధ్యతలను మరొకరికి అప్పగిస్తుందా.. అనే చర్చ నడిచింది. ఈ విషయంపై తాజాగా ద్రవిడ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు.
      
రిపోర్ట్స్ ప్రకారం రాబోయే కాలంలో భారత ప్రధాన కోచ్‌గా ఉండటానికి ద్రవిడ్ ఆసక్తిగా లేనట్లు తెలుస్తుంది. తాను పూర్తి స్థాయి కోచ్‌గా కొనసాగడానికి ఇష్టపడటం లేదని ద్రవిడ్ BCCIకి తెలియజేసాడు. దీంతో భారత్ కు తర్వాత హెడ్ కోచ్ గా తెలుగు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ నియమించడం దాదాపుగా ఖాయమైంది. నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో లక్ష్మణ్ ను హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. నిన్నటి వరకు ద్రవిడ్ గైర్హాజరీలో భారత యువ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ త్వరలోనే పూర్తి స్థాయి హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

లక్ష్మణ్ కోచ్ గా భారత యువ ఆటగాళ్ల జట్టు ఆసియా గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇక ద్రవిడ్ విషయానికి వస్తే తన రెండేళ్ల కాలంలో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఐసీసీ టోర్నీలకు సంబంధించి రెండుసార్లు ఫైనల్స్‌కు, ఒకసారి సెమీస్‌కు జట్టును తీసుకెళ్లాడు. వీటిలో 2023 లో శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిపోయినా ద్రవిడ్ కోచ్ పై ఎలాంటి విమర్శలు రాలేదు.