
- డ్రైనేజీ లైన్లు పొంగితే వెంటనే రిపేర్లు
- మ్యాన్ హోళ్లు తెరిస్తే సీరియస్యాక్షన్
- ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ బిగింపు
- రెడీగా ఎయిర్ టెక్ మెషీన్లు, ఇతర వాహనాలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో వాటర్‌బోర్డు అధికారులు అలర్టయ్యారు. అధికారులంతా తప్పనిసరిగా ఫీల్డ్ లోనే ఉండాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై సీవరేజీ ఓవర్ ఫ్లో కాకుండా, మ్యాన్హోల్స్తెరవకుండా, వాటర్ లాగింగ్, స్టాగ్నింగ్ పాయింట్లను గుర్తించి.. నీరు నిల్వకుండా చూసేందుకు 17 ఎమర్జెన్సీ రెస్పాన్స్టీమ్స్ను రంగంలోకి దింపారు. అలాగే, సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్ (ఎస్పీటీ) వాహనాలను కూడా రెడీ చేశారు. నగరంలో ఇప్పటికే మూతలు లేని డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌పై సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సీవర్ ఇన్ స్పెక్టర్ నేతృత్వంలో ఒక సీవరేజీ టీమ్‌ను ఏర్పాటు చేశారు. వీరు ప్రతి ఉదయం ఫీల్డ్‌కు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తారు.
మ్యాన్ హోల్స్‌ను తెరిస్తే కేసులు
సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడితే నిలిచిన నీళ్లు వెళ్లేందుకు దుకాణాలు, ఇండ్ల ఎదుట ఉన్న మ్యాన్ హోల్స్తెరుస్తుంటారు. తర్వాత మళ్లీ మూయకుండా అలాగే వదిలేస్తారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. నివారించడానికి మ్యాన్ హోల్స్తెరిస్తే సీరియస్యాక్షన్తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అలాగే, లోతైన మ్యాన్ హోల్స్‌తో పాటు సిటీలోని 30 వేలకు పైగా మ్యాన్ హోల్స్‌పై ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ బిగించినట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాల టైంలో పొరపాటున వీటిపై కాలు పెట్టినా సేఫ్టీ గ్రిల్ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగదంటున్నారు. మెయిన్రోడ్లపై ఉన్న మ్యాన్‌హోల్స్‌ను కవర్స్ తో సీల్ చేశామని చెప్తున్నారు.
ఫీల్డ్ స్టాఫ్‌కు రక్షణ పరికరాలు
ఫీల్డ్లెవెల్లో పని చేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందజేశామని వాటర్‌బోర్డు అధికారులు స్పష్టం చేశారు. వీరికి కేటాయించిన వాహనాల్లో జనరేటర్ తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది. దీని సాయంతో వర్షపు నీటిని తొలగిస్తారు. అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ టీమ్స్దృష్టి సారిస్తాయి. వీటితో పాటు ఎయిర్ టెక్ మెషీన్లు సైతం అందుబాటులో ఉంచారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలు (సిల్ట్) ని ఎప్పటికప్పుడు తొలగించేందుకు సిల్ట్ రిమూవింగ్ వాహనాలను ఏర్పాటుచేశారు. అలాగే, వర్షాల సమయంలోనే నీటి కాలుష్యం ప్రబలకుండా చూస్తున్నారు. ఎక్కడైనా సమస్య వస్తే 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయమని
సూచిస్తున్నారు.