‘జల్లంత' తుల్లింత .. వాటర్ ఫాల్స్ కు వరద ఉధృతి.. కొండలపై నుంచి జారుతున్న నీరు

‘జల్లంత' తుల్లింత .. వాటర్ ఫాల్స్ కు వరద ఉధృతి.. కొండలపై నుంచి జారుతున్న నీరు

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రముఖ జలపాతాలు ఉరకలేస్తున్నాయి. ములుగు జిల్లాలోని బొగత, ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, ఆసిఫాబాద్ జిల్లాలోని టేక జాలా, చెచ్చెర, మిట్ట వాటర్​ఫాల్స్​కొండల మీది నుంచి దుంకుతూ కనువిందు చేస్తున్నాయి. బొగత జలపాతం వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో పర్యాటకులను అనుమతించడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని కుంటాల, పొచ్చెర, చెచ్చెర, టేకజలా, మిట్ట జలపాతాలను చూసేందుకు సందర్శకులు క్యూ కడ్తున్నారు. జాలువారే జలతరంగాలను చూస్తూ మురిసిపోతున్నారు. 

-