ఒకే అమ్మాయిని పెళ్లాడిన అన్నదమ్ములు: ఇదేదో వింత కాదు ఆచారం, వైరల్ వీడియో

ఒకే అమ్మాయిని పెళ్లాడిన అన్నదమ్ములు: ఇదేదో వింత కాదు ఆచారం, వైరల్ వీడియో

హిమాచల్ ప్రదేశ్‌లోని షిల్లాయ్ గ్రామంలో హట్టి తెగకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఒకే మహిళను పెళ్లి  చేసుకున్నారు. బహుభర్తృత్వం అనే సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లికి వందల మంది వచ్చారు. వధువు సునీతా చౌహాన్ అలాగే వరులు ప్రదీప్ & కపిల్ నేగి మేము ఎటువంటి ఒత్తిడి లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే జూలై 12న సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్-గిరిలో మూడు రోజుల పాటు సాగిన ఈ వేడుక పాటలు, డాన్సులతో  అలరించాయి. 

అంతేకాక ఈ పెళ్లి వేడుక సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ చట్టాలు ఈ సంప్రదాయాన్ని గుర్తించి దానికి "జోడిదారా" అని పేరు కూడా పెట్టాయి. ట్రాన్స్-గిరిలోని బధానా గ్రామంలో గత ఆరు సంవత్సరాలలో చూస్తే ఇలాంటి ఐదు పెళ్లిళ్లు జరిగాయి.

కున్హాట్ గ్రామానికి చెందిన సునీత మాట్లాడుతూ తనకు ఈ సంప్రదాయం గురించి తెలుసునని, ఎలాంటి ఒత్తిడి లేకుండా నా నిర్ణయం తీసుకున్నానని, వారి మధ్య ఏర్పడిన బంధాన్ని గౌరవిస్తానని అన్నారు. షిల్లై గ్రామానికి చెందిన ప్రదీప్ ప్రభుత్వ శాఖలో పనిచేస్తుండగా, అతని తమ్ముడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తాను విదేశాల్లో ఉంటుండొచ్చు, కానీ ఈ పెళ్లి ద్వారా మేము మా భార్యకు ఐక్య కుటుంబంగా మద్దతు, స్థిరత్వం,  ప్రేమను అందిస్తున్నాం" అని కపిల్ అన్నారు.

హట్టి అనేది హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దులో ఉంటుంది. మూడు సంవత్సరాల క్రితం ఇక్కడి ప్రజల్ని షెడ్యూల్డ్ తెగగా ప్రకటించింది. ఈ తెగలో బహుభర్తృత్వం శతాబ్దాలుగా కొనసాగుతుంది. కానీ మహిళల్లో ఉన్నత విద్య పెరగడం, ఆర్ధికంగా స్థిరపడటం   బహుభర్తృత్వ కేసులు తక్కువ ఉంటున్నాయి. ఇలాంటి పెళ్లిళ్లు రహస్యంగా జరుగుతాయని, సమాజం కూడా  వాటిని ఒప్పుకుంటుందని, అయితే  అలాంటి పెళ్లిళ్లు తక్కువగా ఉంటాయని గ్రామంలోని పెద్దలు చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఉద్దేశం పూర్వీకుల భూమి విభజించకుండా చూసుకోవడం, పూర్వీకుల ఆస్తిలో గిరిజన మహిళల వాటా ఇప్పటికీ  ఓ సమస్యగా ఉంది. సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్ గిరి ప్రాంతంలో  దాదాపు 450 గ్రామాలలో హట్టి కమ్యూనిటీకి చెందిన దాదాపు మూడు లక్షల మంది నివసిస్తున్నారు, కొన్ని గ్రామాలలో బహుభర్తృత్వం ఇప్పటికీ ఆచరించే సంప్రదాయం ఉంది.  

"జాజ్దా" అని పిలిచే ఈ ప్రత్యేకమైన గిరిజన వివాహ సంప్రదాయంలో వధువు ఊరేగింపుగా వరుడి గ్రామానికి వస్తుంది అలాగే "సీంజ్" అని పిలువబడే ఆచారాన్ని వరుడి ఇంట్లో నిర్వహిస్తారు. పండితులు స్థానిక భాషలో మంత్రాలను చెబుతూ వధూవరుల మీద పవిత్ర జలాన్ని చల్లుతారు. చివరికి కుల దేవతకి బెల్లం నైవేద్యంగా పెడతారు.