గూగుల్ పే కొత్త ఫీచర్.. ఇక పిల్లలు ఎంత ఖర్చు చేస్తున్నారో బ్యాంక్ అకౌంట్ లేకున్నా తెలుసుకోవచ్చు..

గూగుల్ పే కొత్త ఫీచర్.. ఇక పిల్లలు ఎంత ఖర్చు చేస్తున్నారో బ్యాంక్ అకౌంట్ లేకున్నా తెలుసుకోవచ్చు..

డిజిటల్ పేమెంట్స్ యుగంలో పిల్లలకు చేతికి డబ్బు  ఇచ్చే బదులు, గూగుల్ పే 'పాకెట్ మనీ' అనే కొత్త ఫీచర్ పరిచయం చేసింది.  దీనితో పిల్లలకు ప్రత్యేకంగా  బ్యాంక్ అకౌంట్ లేకపోయినా, తల్లిదండ్రుల అకౌంట్ నుండే డబ్బులు ఖర్చు చేయవచ్చు.

ఈ ఫీచర్‌లో  రెండు అప్షన్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ యూజర్ అంటే తల్లి/తండ్రి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. రెండవది సెకండరీ యూజర్ అంటే పిల్లలు/ఆధారపడిన వారు.. తల్లిదండ్రుల అనుమతితో డబ్బు ఖర్చు చేయవచ్చు. తల్లిదండ్రులు గరిష్టంగా ఐదుగురిని ఇలా సెకండరీ యూజర్లుగా చేర్చుకోవచ్చు. దీనికోసం పిల్లల ఫోన్‌లో కూడా GPay ఉండాలి.

పిల్లలు ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయకుండా తల్లిదండ్రులు రెండు రకాల సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు.  ఒకటి నెలకు గరిష్టంగా రూ. 15,000 వరకు లిమిట్ సెట్ చేయవచ్చు. ఈ మొత్తంలో పిల్లలు ప్రతిసారీ తల్లిదండ్రులను అడగకుండానే సొంతంగా పేమెంట్స్ చేసుకోవచ్చు.

రెండవది పిల్లలు ఏ వస్తువు కొన్నా, వారు పేమెంట్ బటన్ నొక్కగానే తల్లిదండ్రుల ఫోన్‌కు రిక్వెస్ట్ వస్తుంది. మీరు ఓకే అంటేనే డబ్బు కట్ అవుతుంది.

ఎలా సెటప్ చేయాలంటే 
*ముందుగా GPay ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లి 'UPI Circle' ఆప్షన్‌ సెలెక్ట్ చేసుకోవాలి.
*ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేసుకొని, ఒక QR కోడ్‌ను స్కాన్ చేయాలి.
*ఖర్చు చేసే లిమిట్ సెట్ చేసి ఇన్విటేషన్ పంపాలి.
*అవతలి వారు  ఇన్విటేషన్ అంగీకరించి, సాధారణ కేవైసీ (KYC) పూర్తి చేస్తే ఈ ఫెసిలిటీ మొదలవుతుంది.

దీనివల్ల లాభం ఏంటంటే 
 పిల్లలకు బ్యాంక్ అకౌంట్ అక్కర్లేదు, డెబిట్ కార్డులు అవసరం లేదు. పిల్లలు ఎక్కడ, ఎంత ఖర్చు చేస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించవచ్చు. చిన్నతనం నుండే డబ్బును బాధ్యతగా ఎలా ఖర్చు చేయాలో పిల్లలకు నేర్పించవచ్చు.