
దేశంలో మారుమోగుతున్న ఒకే ఒక్క పేరు.. అది ఏంటో తెలుసా కపిల్ రాజ్.. ఎవరీ కపిల్ రాజ్ అంటూ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటారా.. 60 ఏళ్ల వయస్సులో ఇతను రిలయన్స్ ఇండస్ట్రీలో చాలా పెద్ద ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ప్రభుత్వంలో ఇతను చేసిన ఉద్యోగం ఏంటో తెలుసా ఈడీ జాయింట్ డైరెక్టర్.. మోదీ ప్రభుత్వం హయాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ లో జాయింట్ డైరెక్టర్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు.. అంతేనా.. అప్పట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను.. అప్పటి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేసింది కూడా ఈయనే.. ED జాయింట్ డైరెక్టర్ గా రిటైర్ అయిన తర్వాత.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరారు.
2009 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి అయిన కపిల్ రాజ్, ప్రభుత్వ సర్వీస్ నుండి రిటైర్మెంట్ తీసుకొని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో చేరి వార్తల్లోకి ఎక్కారు. 45 ఏళ్ల వయసు ఉన్న రాజ్ సివిల్ సర్వీసులలో 16 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 17 జూలై 2025న అధికారికంగా రిటైర్మెంట్ చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఆయన రాజీనామా వ్యక్తిగత కారణాలను చూపింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లో జాయింట్ డైరెక్టర్‌గా రాజ్ బాగా పేరు పొందారు, అక్కడ ఆయన ఎనిమిది సంవత్సరాలు పని చేసి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చాల హై లెవెల్ దర్యాప్తులు చేసారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సంబంధం ఉన్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ దర్యాప్తులో అలాగే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భూ కుంభకోణం కేసుతో సహా రాజకీయంగా సున్నితమైన కేసులలో ఆయన దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌కు చెందిన ఆయన చదువు పరంగా లక్నో నుండి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. అయితే కపిల్ రాజ్ నియామకంపై RIL ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.