
శంషాబాద్,వెలుగు: భర్తకు వీడియో కాల్ చేసి భార్య సూసైడ్ చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి హైదర్‌గూడలోని చైతన్య విలాస్‌లో ఉండే సిటీకి చెందిన సాయి శివ, ఏపీలోని గుంటూరుకు చెందిన నాగదేవి (32) దంపతులు పది నెలల కిందట లవ్‌మ్యారేజ్ చేసుకున్నారు. సాయిశివ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, నాగదేవి ఇక్కడ బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. అతడు వారానికి రెండు రోజులు వచ్చి వెళ్తుంటాడు. సాయి శివ తాతకు ఆరోగ్యం బాగా లేకపోతే చూడడానికి గత శనివారం సిటీకి వచ్చాడు. అయితే కొద్ది రోజులుగా దంపతులు మధ్య గొడవలు అవుతుండగా, మరోసారి అయ్యాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి భర్తకు నాగదేవి వీడియో కాల్ చేసి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అతడు వెంటనే స్థానికులకు ఫోన్ చేసి చెప్పగా, వారు వెళ్లేసరికే ఆమె చనిపోయి ఉంది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి డెడ్‌బాడీని ఉస్మానియాకు తరలించారు.