విమెన్స్  హాకీ ఆసియా కప్ లో ఓడిన టీమిండియా

V6 Velugu Posted on Jan 27, 2022

మస్కట్: విమెన్స్  హాకీ ఆసియా కప్ లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా టైటిల్ నిలబెట్టుకోలేకపోయింది. బుధవారం జరిగిన సెమీస్‌లో ఇండియా 2–3తో కొరియా చేతిలో ఓడింది. ఇండియా తరఫున వందన (28వ ని.), లాల్‌రెమిసియా (54వ ని.) గోల్స్ చేశారు.  కొరియా టీమ్ లో ఎనుబి చియోన్, (31వ ని), సియూంగ్ లీ (45వ ని), హ్యేజిన్ చో (47వ ని) గోల్స్ సాధించారు. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి రెండు టీమ్ లు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ఫస్ట్ క్వార్టర్ లో ఒక్క గోలూ నమోదు కాలేదు. రెండో క్వార్టర్ లో అటాకింగ్ ప్లేతో ఆకట్టుకున్న ఇండియా మొదటి గోల్ కొట్టింది. ఇక మూడో క్వార్టర్ లో కొరియా గట్టి కౌంటర్ ఇచ్చి ఏకంగా రెండు గోల్స్ చేసింది. అదే టెంపోను కొనసాగిస్తూ నాలుగో క్వార్టర్ లో మరో గోల్ చేసి ఆధిక్యాన్ని 3–-1కు పెంచుకుంది. చివర్లో ఇండియా ఓ గోల్ సాధించినా ఫలితం లేకపోయింది.

Tagged Womens Asia Cup Hockey, India lose, India women Hockey

Latest Videos

Subscribe Now

More News