మహిళా రిజర్వేషన్ బిల్లుపై .. లోక్సభలో అమిత్ షా కీలక ప్రకటన

మహిళా రిజర్వేషన్ బిల్లుపై .. లోక్సభలో అమిత్ షా కీలక ప్రకటన

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర హోమంత్రి అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. 2024 సార్వత్రిక  ఎన్నికల్లో  ఈ బిల్లు వర్తించదని స్పష్టం చేశారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌ పూర్తయిన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు పూర్తయిన తరువాత ఈ ప్రక్రియను మొదలు పెడతామని అమిత్ షా స్పష్టం చేశారు. మహిళా సాధికారత విషయంలో బీజేపీ ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా నిలుస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తమకు రాజకీయ అజెండా కాదనన్నారు.  

మరోవైపు  మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో ఈ బిల్లును  న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సెప్టెంబర్‌ 19న ప్రవేశపెట్టగా.. బుధవారం దీనిపై చర్చ జరిగింది. చర్చ అనంతరం మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో చారిత్రాత్మక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లయింది.