మిడ్నాపూర్‌లోభారీ వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన

మిడ్నాపూర్‌లోభారీ వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన

పశ్చిమబెంగాల్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి.మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో మిడ్నాపూర్‌లో ఘటల్ ఏరియాలోని నది పొంగి ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం ఉధృతికి చెక్క వంతెన కొట్టుకుపోయింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన కొట్టుకు పోవడంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు రాబోయే మూడు రోజుల్లో మరిన్ని వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న(గురువారం) కురిసిన వర్షాలతో కోల్‌కతాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఆసాన్‌సోల్‌ లోని పలు ఇళ్లు, బిల్డింగ్ లు పాక్షికంగా మునిగిపోయాయి. శనివారం వరకూ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.