వర్క్​ ఫ్రమ్​ హోమ్ లో జంటగా .. హ్యాపీగా

వర్క్​ ఫ్రమ్​ హోమ్ లో జంటగా .. హ్యాపీగా

కరోనా, లాక్​డౌన్ కారణంగా ఆఫీసుకు వెళ్లే భార్యాభర్తల్లో చాలామంది వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేస్తున్నారు. కానీ ఫ్యామిలీ  టైం దొరికిందనే సంతోషం కొద్ది రోజుల్లోనే తగ్గిపోతోంది కొందరిలో. రోజంతా ఇంట్లోనే ఉండడం, పని ఒత్తిడి వల్ల  దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు పెరిగి వాళ్ల అన్యోన్యతను దెబ్బతీస్తున్నాయి. అయితే  ఇద్దరూ ఎంత స్ట్రాంగ్​గా ఉంటే  అంత తొందరగా ఇలాంటి వాటి నుంచి బయటపడొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు అంటున్నారు సైకాలజిస్ట్​లు.

కరోనా టైంలో ఇద్దరు కూడా ఒకే ఎమోషన్స్​ను ఎక్స్​పీరియెన్స్​ చేస్తున్నారని గ్రహించాలి. ఒకరికొకరు సర్ది చెప్పుకోవాలి. మొదట్లో గొడవ పడినప్పుడు ఇద్దరినీ దగ్గర చేసిన సంఘటనలను గుర్తుచేసుకోవాలి. లవ్​ స్ట్రాంగ్​గా ఉంటే ఏ గొడవ అయినా నిమిషాల్లో సాల్వ్​ అవుతుంది. ఎప్పుడూ ఒకరి మాటే నెగ్గాలని అనుకోవద్దు. ఒక్కోసారి పార్ట్​నర్​ కోణంలోంచి ఆలోచించాలి. అప్పుడే వాళ్లను అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. దాంతో ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. అవసరాలను, చెప్పాలనుకున్న విషయాలను క్లియర్​గా చెప్పాలి. అలాచేస్తే రిలేషన్​షిప్​లో ఏ ప్రాబ్లమ్​ రాదు. అవతలి వాళ్లు ఏదైనా చెప్పినప్పుడు కామ్​గా వినాలి. అంతేకానీ వెంటనే రియాక్ట్​ అవకూడదు. ఇద్దరూ హ్యాపీ మూడ్​లో ఉన్నప్పుడు ఆ విషయాలను డిస్కస్​ చేయొద్దు. ఇల్లు, ఆఫీసు పనులకు బ్రేక్​ ఇచ్చి, కాసేపు ఏకాంతంగా గడపాలి. దాంతో రిలేషన్​షిప్​ పాజిటివ్​గా, హెల్దీగా ఉంటుంది.