యాదాద్రి, వెలుగు: వానలు తగ్గుముఖం పట్టినందున వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. భువనగిరి మండలం అనంతారంలోని కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు.
ఇప్పటివరకు చేసిన వడ్ల కొనుగోళ్లపై ఆరా తీశారు. వడ్ల కుప్పల వద్దకు వెళ్లి తేమశాతం పరిశీలించారు. తేమశాతం వచ్చిన వడ్లను త్వరగా కాంటా వేసి, మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
