- యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి, వెలుగు: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తుంనందున ధాన్యం కుప్పలను టార్పాలిన్స్ కవర్లతో కప్పి ఉంచాలని సూచించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు? కొనుగోలు చేసినంత వరకు ట్యాబ్ ఎంట్రీ పూర్తి అయిందా అని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
