- 2025–-26లో రూ. 3 కోట్లు మంజూరు
- ఈ ఇయర్‌లో ఇప్పటికే 1116 ఎకరాల్లో ఇన్స్టాలేషన్
- రూ. 2.91 కోట్లు వ్యయం
- ఎస్సీ, ఎస్టీ రైతుల అప్లికేషన్స్ ప్రాసెస్
యాదాద్రి, వెలుగు: సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న డ్రిప్‌ను రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. 2025–-26 మధ్యలోనే రిలీజ్అయిన ఫండ్స్‌లో జనరల్ కోటా ఖర్చు అయింది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కోటాకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. తక్కువ నీటి వనరులతో ఎక్కువ భూమిని సాగు చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్‌ను డెవలప్మెంట్చేయడానికి రైతులకు 80 శాతం నుంచి వంద శాతం వరకూ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది.
ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో ఇస్తుండగా, బీసీలకు 90 శాతం, జనరల్ విభాగంలో 80 శాతం సబ్సిడీ డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అందిస్తోంది. అయితే సబ్సిడీ ఎంత శాతం ఇచ్చినా జీఎస్టీ మాత్రం ప్రతి రైతు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో 18 శాతం జీఎస్టీ ఉండగా ప్రస్తుతం అది 5 శాతానికి తగ్గింది.
కూరగాయల తోటలకే 60 శాతం
2017–-18 వరకూ డ్రిప్ఇరిగేషన్కు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫండ్స్రిలీజ్ చేసేది. ఆయిల్పామ్సాగు పెంపు విషయంలో ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. దీంతో పండ్ల తోటలు, కూరగాయల తోటలకు సబ్సిడీతో అందించే డ్రిప్‌కు ఫండ్స్కొంతమేర తగ్గింది. అయితే ఈ ఫండ్స్ లో 20 శాతం పండ్ల తోటలు, 20 శాతం పత్తి, కంది వంటి పంటలకు డ్రిప్సమకూర్చుకునే రైతులకు అందిస్తారు. మిగిలిన 60 శాతం ఫండ్స్‌తో కూరగాయలు సాగు చేసే రైతులకు డ్రిప్ అందిస్తారు. అయితే12.50 ఎకరాల లోపు తోటలు సాగు చేసే రైతులకు ఈ సబ్సిడీ వర్తించనుంది.
కొత్తగా 1116 ఎకరాల్లో డ్రిప్
2025–-26 ఫైనాన్స్ ఇయర్‌లో మూడు దశల్లో రూ. 3 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 80, 90 శాతం సబ్సిడీతో 365 మంది రైతులు కొత్తగా 1116 ఎకరాల్లో డ్రిప్‌ఇరిగేషన్ ఇన్స్టాలేషన్ చేశారు. ఇందుకోసం రూ. 2.91 కోట్లు రిలీజ్ అయింది. ప్రస్తుతం వంద శాతం సబ్సిడీ పొందే ఎస్సీ, ఎస్టీ రైతులకు సంబంధించిన ప్రాసెస్ నడుస్తోంది.
జిల్లాలో 26 వేల ఎకరాల్లో సాగు
జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో భూమి సాగుకు యోగ్యంగా ఉంది. ఇందులో 4 లక్షల ఎకరాలకు పైగా వరి, పత్తి, కంది సహా ఇతర పంటలు సాగు చేస్తున్నారు. తోటలు, కూరగాయలు 26 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో 12 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు సాగు చేస్తుండగా నిమ్మ తోటలు మరో 3 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 5 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్, మరో 9 వేల ఎకరాల్లో ఇతర పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. కూరగాయలు మాత్రం 1500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొత్తంగా 4,63,602 ఎకరాల్లో 2.53 లక్షల మంది రైతులు పంటలను సాగు చేస్తున్నారు.
