యెడియూరప్పకు కోర్టులో ఊరట

 యెడియూరప్పకు కోర్టులో ఊరట
  •   అరెస్ట్​పై కర్నాటక హైకోర్టు స్టే

బెంగళూరు : పోక్సో కేసులో కర్నాటక మాజీ సీఎం, బీజేపీ నేత యెడియూరప్పకు ఊరట లభించింది. ఆయనపై బెంగళూరులోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పై కర్నాటక హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 17న జరగనున్న తదుపరి విచారణ వరకు యెడియూరప్పను అరెస్టు చేయవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. 17న సీఐడీ ఎదుట కచ్చితంగా హాజరుకావాలని ఆదేశిం చింది.

 పోక్సో కేసులో విచారణకు హాజరు కావాలని యెడియూరప్పకు సీఐడీ పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయినా హాజరు కాకపోవడంతో బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.దీంతో యెడియూరప్ప హైకోర్టులో ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణ(జూన్ 17) వరకు యెడియూరప్పను అరెస్టు చేయొద్దని హైకోర్టు పేర్కొంది.