జహీరాబాద్ స్మార్ట్సిటీపై ఫోకస్.. ఇండస్ట్రియల్ హబ్‌‌గా అభివృద్ధి చేసేందుకు సర్కార్ అడుగులు

జహీరాబాద్ స్మార్ట్సిటీపై ఫోకస్.. ఇండస్ట్రియల్ హబ్‌‌గా అభివృద్ధి చేసేందుకు సర్కార్ అడుగులు
  • హైదరాబాద్-నాగ్‌‌పూర్​ఇండస్ట్రియల్​కారిడార్‌‌‌‌లో భాగంగా నిర్మాణం
  • రూ.1,206 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్‌‌ 1.. టెండర్లకు ఆహ్వానం 
  • స్కూళ్లు, హాస్పిటళ్లు సహా అన్ని సౌలతులు ఏర్పాటు 
  • మొదటి దశలో 1.90 లక్షల మందికి ఉద్యోగాలు 
  • నిర్మాణ గడువు మూడేండ్లు.. డిఫెక్ట్​లయబిలిటీ పీరియడ్​నాలుగేండ్లు 

హైదరాబాద్, వెలుగు: జహీరాబాద్‌‌ను స్మార్ట్​సిటీగా డెవలప్​చేసేందుకు రాష్ట్ర సర్కార్ కార్యాచరణ వేగవంతం చేసింది.కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌‌లో చేపడుతున్న హైదరాబాద్-నాగ్‌‌పూర్​ఇండస్ట్రియల్​కారిడార్‌‌‌‌లో భాగంగా జహీరాబాద్‌‌ను ఇండస్ట్రియల్​హబ్‌‌గా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సహకారంతో జహీరాబాద్‌‌ను ఇండస్ట్రియల్​స్మార్ట్​సిటీగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. 

ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్​ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్​కార్పొరేషన్​ (టీజీఐఐసీ) ద్వారా 3,245.48 ఎకరాల భూములు సమకూర్చింది.జహీరాబాద్​ఇండస్ట్రియల్​స్మార్ట్​సిటీ ఫేజ్​1 అభివృద్ధికి గత నెల 28న టీజీఐఐసీ టెండర్లు కూడా ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు అక్టోబర్​7 వరకు అవకాశం ఇచ్చింది. మొదటి దశ నిర్మాణాలు పూర్తి చేయడానికి రూ.1,206.44 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. దానికి అదనంగా జీఎస్టీ, ఇతర చార్జీలు, ఫీజులను కలిపింది. మరో రూ.24.13 కోట్లు ఆపరేషన్​అండ్​మెయింటెనెన్స్​కాస్ట్‌‌గా పేర్కొంది. 

మూడేండ్లలో పూర్తి..

టెండర్​దక్కించుకున్న సంస్థ మూడేండ్లలో జహీరాబాద్​ఇండస్ట్రియల్​స్మార్ట్​సిటీని అభివృద్ధి చేయాలని టెండర్​డాక్యుమెంట్‌‌లో టీజీఐఐసీ పేర్కొంది. సిటీ పూర్తయినట్టు కంప్లీషన్​సర్టిఫికెట్ పొందినప్పటి నుంచి నాలుగేండ్ల పాటు డిఫెక్ట్​లయబిలిటీ పీరియడ్​ఉంటుందని స్పష్టం చేసింది. 

పనుల్లో భాగంగా సిటీ డిజైన్, నిర్మాణం, టెస్టింగ్, కమిషనింగ్, ఆపరేషన్ అండ్​మెయింటెనెన్స్ పనులన్నింటినీ నిర్మాణ సంస్థే చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది. స్మార్ట్​సిటీ అభివృద్ధిలో భాగంగా గ్రీన్​ఫీల్డ్​రోడ్లను వేయనున్నారు. జియోటెక్నికల్, జియోఫిజికల్​టెస్టులు చేసిన తర్వాతే స్మార్ట్​ సిటీ నిర్మాణం చేపట్టాలని.. నేల పరిస్థితులపై అధ్యయనం చేశాక నిర్మాణాలను ప్రారంభించాలని పేర్కొన్నారు. 

విదేశీ ప్రమాణాలతో..

విదేశీ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా జహీరాబాద్​స్మార్ట్​సిటీని డెవలప్​ చేయనున్నారు. ముఖ్యంగా రోడ్ల విషయంలో అమెరికా, బ్రిటన్​, కెనడా, న్యూజిలాండ్​, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్​వంటి దేశాల్లో పాటిస్తున్న ప్రమాణాలకు తగ్గట్టు పనులు చేపట్టాల్సి ఉంటుందని టెండర్​డాక్యుమెంట్‌‌లో టీజీఐఐసీ స్పష్టం చేసింది. టెండర్​దక్కించుకునే సంస్థ ఆయా దేశాల్లోని కోడ్స్​ప్రాక్టీస్, స్పెసిఫికేషన్స్, గైడ్‌‌లైన్స్‌‌కు అనుగుణంగా వివరాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. 

రోడ్ల నిర్మాణానికి సంబంధించి కోడ్‌‌ల వివరాలనూ టెండర్​డాక్యుమెంట్‌‌లో వెల్లడించింది. అమెరికన్​అసోసియేషన్​ఆఫ్​స్టేట్​హైవే ట్రాన్స్‌‌పోర్టేషన్​ అఫీషియల్స్​(ఏఏఎస్​హెచ్‌‌టీవో), అమెరికన్​సొసైటీ ఫర్​ టెస్టింగ్​ఆఫ్​మెటీరియల్స్​(ఏఎస్​టీఎం), యూరో కోడ్స్​వంటి ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. 

స్మార్ట్ సిటీలో అన్ని సౌకర్యాలు ఉండేలా అధికారులు ప్లాన్​చేస్తున్నారు. రోడ్లు, యుటిలిటీ డక్ట్‌‌లు, చిన్న వంతెనలు/క్రాస్​డ్రైనేజ్​స్ట్రక్చర్స్, విద్యుదీకరణ (సబ్​స్టేషన్ల నిర్మాణం, నెట్​వర్క్, కేబుల్స్, ఎర్తెన్​ట్రెంచ్‌‌లు, ట్రాన్స్‌‌ఫార్మర్లు), నీటి వసతి కల్పన (అగ్నిప్రమాదాలు జరిగితే ప్రత్యేకంగా నీటి వనరులు, గ్రౌండ్​లెవెల్​వాటర్​రిజర్వాయర్లు, ఎలివేటెడ్​లెవెల్​ సర్వీస్​రిజర్వాయర్, ఫైర్​ఫైటింగ్​హైడ్రెంట్​సిస్టమ్), రీసైకిల్​వాటర్, స్టార్మ్​వాటర్​నెట్‌‌వర్క్, రెయిన్​వాటర్​హార్వెస్టింగ్​సంపులు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం/పారిశ్రామిక వ్యర్థ జలాల నిర్వహణ, కామన్​డ్రైనేజ్​ట్రీట్‌‌మెంట్​ప్లాంట్లు, వాటర్​ట్రీట్‌‌మెంట్​ప్లాంట్లు (పంపింగ్​స్టేషన్స్, ట్యాంకులు, నీటి సంపులు), ఎంట్రెన్స్​ప్లాజా అండ్​బౌండరీ ఫెన్సింగ్​వంటి సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నది. కాగా, స్మార్ట్​సిటీలో భాగంగా దాదాపు 4 లక్షల మంది దాకా ఉపాధి కల్పించనున్నారు. అందులో ఫస్ట్​ఫేజ్‌‌‌‌లో 1.9 లక్షల మందికి ఉపాధి లభించనుంది. అంతేగాకుండా ప్రైమరీ స్కూళ్లు, ఇండ్లు, హాస్పిటళ్ల వంటి సౌకర్యాలనూ కల్పించనున్నారు.